Saturday, December 17, 2011

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ… సిరివెన్నెల


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ…
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరినీ…
విశ్రమించవద్దు ఏక్షణం…విస్మరించవద్దు నిర్నయం..
అప్పుడే నీ జయం నిశ్చయం రా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ…
నింగి ఎంత పెద్దదైన, రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా…
సంద్ర మెంత గొప్పదైన,ఈదుతున్న చేప పిల్ల మొప్పముందు చిన్నదేనురా…
పశ్ఛిమాన పొంచివుండి, రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా…
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా…
నిషావిలాసమెంత సేపురా…ఉషోదయాన్ని ఎవ్వడాపురా..
రగులుతున్న గుండెకూడ సూర్యగోళవంటిదేనురా….

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ…
నొప్పిలేని నిముశమేది…జననమయిన మరణమయిన జీవితాన అడుగు అడుగునా…
నీరసించి నిలిచిపోతె…నిముషమయిన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ…
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది..ఇంతకంన్న సైన్యముండునా…
ఆశ నీకు అస్త్రమవును శ్వాస నీకు శస్త్రమవును… ఆశయమ్ముసారధౌనురా
నిరంతరం ప్రయత్నమున్నదా…నిరాషకే నిరాషపుట్టదా….ఆయువంటు వున్నవరకు చావుకూడ నెగ్గలేక శవము పైన గెలుపు చాటు రా..
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ…


No comments: